యాంటీ ర్యాగింగ్‌పై ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయమూర్తి జి. వాణి పేర్కొన్నారు. స్థానిక బాపట్ల మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బాపట్ల మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఒకరితో ఒకరు స్నేహభావంతో ఉండాలని సూచించారు. విద్యార్థుల మధ్య పరిచయాలు వారి భవితకు మార్గం చూపేవిగా ఉండాలని చెప్పారు.