ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. సాగునీటి రంగంలో వైకాపా ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఐదు ప్రధాన నదులు గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధారలను అనుసంధానం చేస్తే రాష్ట్రానికి నీటికష్టాలు ఉండవని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. జిల్లాలోని ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.