తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈ నెల 12న శుద్ద తిరుమల-సుందర తిరుమల కార్యక్రమం నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ జేఈవో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా తిరుమలలోని వ్యర్థాలను తొలగించి శుభ్రం చేయనున్నారు. ఘాట్ రోడ్డు, ఫుట్‌పాత్స్, నడకదారులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న చెత్తను సేకరించనున్నారు.
టీటీడీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లోని విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనుండగా.. ప్రాంతాలను సెక్టార్లుగా విభజించి క్లీనింగ్ చేయనున్నారు. ఒక సెక్టార్‌కు ఒక అధికారికి ఇంచార్జ్‌గా నియమించనుండగా.. హెల్త్, విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులందరూ ఇందులో పాల్గొననున్నారు. విద్యార్థులు తిరుమలలోని చెత్తను తొలగించనుండగా.. కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులు వీటిని పర్యవేక్షించనున్నారు. ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, కాలేజీల విద్యార్థులు ఇందులో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.
విద్యార్థులు చెత్తలను సేకరించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. కవర్లతో పాటు డస్ట్ బిన్లు, గ్లౌజులు, మాస్కులు, పరకలు అందించనున్నారు. అలాగే విద్యార్థులకు టీ, స్నాక్స్, టీ, ఆహారం, ఇతర సదుపాయాలు విద్యార్ధులు కల్పించనున్నారు. దీనికి సంబంధించి తిరుపతిలోని అన్నప్రసాదం స్టాఫ్‌తో భాగస్వామ్యం చేసుకోవాలని కాలేజీల ప్రిన్సిపాళ్లకు టీటీడీ సూచించింది. ఒక రోజంతా ఈ కార్యక్రమం జరగనుంది. తొలిసారిగాఈ ఏడాది మే 13న టీటీడీ ఈవో ధర్మారెడ్డి సూచనతో నిర్వహించిన కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మరోసారి ఆ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించేందుకు చేపట్టిన సమావేశానికి కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇతర విభాగాలకు చెందిన టీటీడీ అధికారులు హాజరయ్యారు.
ఈ సారి కూడా కార్యక్రమాన్ని విజయంతంగా చేపట్టాలని, తిరుమలలో పర్యావరణాన్ని కాపాడదామని జీఈవో సదా భార్గవి పిలుపునిచ్చారు. అయితే తిరుమలకు రోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. కవర్లను ఎక్కడ బడితే అక్కడ పడేస్తూ ఉంటారు. దీని వల్ల రోడ్లపై చెత్తాచెదారం ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. వీటన్నింటినీ తొలగించాలంటే టీటీీడీ శాటిటేషన్ సిబ్బందికి కూడా కష్టమే. అందుకే విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలను మరింతగా నిర్వహించనుంది.