గుంటూరు జిల్లాకు చెందిన ఉలవ సురేష్ పుప్పాల సుహాసిని (36)తో సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు కీర్తన (13), జెర్సీ (1) కుమార్తెలు ఉన్నారు. వీరిని వదిలించుకోవాలనుకున్న సురేష్ ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి గోదావరిలోకి నెట్టేశాడు. ఈ ఘటనలో సుహాసిని, జెర్సీలు గల్లంతయ్యారు. కీర్తన మాత్రం బ్రిడ్జి పక్కన వేసిన కేబుల్ పైప్‌ను ఒక చేత్తో పట్టుకుని ప్రాణాలు కాపాడుకుంది. తన జేబులో ఉన్న ఫోన్ తీసి 100కి డయల్ చేసింది. పోలీసులు అక్కడికి చేరుకుని కీర్తన ప్రాణాలు కాపాడారు.