26 పార్టీలతో కూడిన విపక్ష కూటమి ‘ఇండియా’ సమన్వయ కమిటీ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్వీనర్‌గా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నుకోనున్నారు. కూటమి తదుపరి సమావేశం ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ముంబైలో జరగనుంది. ఈ సమావేశంలో కూటమికి చెందిన 11 మంది సభ్యులు చైర్‌పర్సన్స్‌గా సోనియా గాంధీని, కన్వీనర్‌గా నితీష్ కుమార్‌ను ఎన్నుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.