ఓ కుటుంబంపై వాలంటీరు, అతడి బంధువులు దాడి చేసిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగింది. పట్టణానికి చెందిన చంద్రశేఖర్ తన బావమరిదిని చెడగొడుతున్నావంటూ వాలంటీరు మహేష్‌తో గొడవపడ్డారు. దీంతో ఆదివారం సాయంత్రం వాలంటీరు, అతడి కుటుంబసభ్యులు చంద్రశేఖర్ భార్య గౌతమి (27)పై దాడి చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన ఆమె అత్త కృష్ణమ్మ(70)పై సైతం దాడి చేశారు. చంద్రశేఖర్ గాయపడిన తల్లి, భార్యను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.