జిల్లా విద్యాశాఖాధికారిగా కె. వెంకటేశ్వరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జి డీఈఓగా వ్యవహరిస్తున్న ఆర్జేడీ ఎం. జ్యోతికుమారి నుంచి ఈయన పూర్తి అదనపు (ఎఫ్ఎసీ) బాధ్యతలు స్వీకరించారు. వెంకటేశ్వరరావు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా పనిచేస్తున్నారు. వెంకటేశ్వరరావును డీవైఈఓలు, ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది అభినందించారు.