పెడన పట్టణం సోమవారం కృత్తివెన్ను మండలం యండపల్లి పంచాయితీలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పెడన నియోజకవర్గం తెలగుదేశం పార్టీ ఇంచార్జ్ కాగితా కృష్ణ ప్రసాద్ పాల్గొని, వైసిపి చెస్తున్న ఆరాచక పాలన గురించి వివరిస్తు, ఇంటింటికీ తిరుగుతూ, కరపత్రాలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో కృత్తివెన్ను మండలం 16 పంచాయితీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.