ప్రజా గాయకుడు గద్దర్ భౌతికకాయానికి వైయస్ఆర్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్‌రావు నివాళులర్పించారు. గద్దర్ అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో గద్దర్ మృతిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు జూపూడి ప్రభాకర్ తెలిపారు. ప్రజా గాయకుడు గద్దర్ దళితులు, పేదల పక్షాన పోరాటం చేసిన ఉద్యమకారుడని, అలాంటి పోరాటయోధుడిని ఈ సమాజం కోల్పోయిందన్నారు. ఆయన వదిలి వెళ్లిన ఆశయాలను శిష్యులు అందుకోవాలన్నారు. వైయస్ జగన్ ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా ఇక్కడికి రాలేకపోయారు. గద్దర్ కుటుంబ సభ్యులకు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతిని, సంతాపం తెలిపారు.