సీఎం జగన్ నేడు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించేందుకు కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరారు. ఇవాళ సీఎం వైయస్ జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి కూనవరం, వీఆర్‌పురం మండలాల బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడనున్నారు. అనంతరం కుక్కునూరు మండలం గొమ్ముగూడెం సందర్శించనున్నారు. సాయంత్రం రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్‌హౌజ్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. రాత్రికి అక్కడే బసచేయనున్నారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించి, వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో సీఎం వైయస్ జగన్ నేరుగా మాట్లాడనున్నారు. వరద సహాయ, పునరావాస చర్యలు అమలు చేసిన తీరుపై స్వయంగా బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకోనున్నారు.