భారత అంతర్గత వ్యవహారాలను తెలుసుకునేందుకు.. దాయాది దేశం పాకిస్థాన్ ప్రయోగించిన హానీ ట్రాప్లో ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చిక్కుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కీలక సమాచారం పాకిస్థాన్ గూఢచార సంస్థకు చేరినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. 2002 నుంచి సీఐఎస్ఎఫ్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ కదలికలపై ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. దీంతో దర్యాప్తు ప్రారంభించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.