బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ భారీ ట్రాఫిక్ వేలకోట్ల నష్టాన్ని మిగిల్చుతుంది. నగరంలో ట్రాఫిక్ సమస్యతో ఏడాదిలో రూ. 19,725 కోట్లు నష్టం వాటిల్లుతుందని ఓ సర్వేలో తేలింది. రోడ్ ప్లానింగ్, ట్రాఫిక్ నిర్వహణ, ఫ్లైఓవర్, మౌళిక సదుపాయాల లోటును సర్వేలో పరిశీలించింది. ప్రస్తుతం నగరం 985 చదరపు కిలోమీటర్లు ఉండగా, దీన్ని 1,100 చదరపు కిలోమీటర్లకు విస్తరించాలని సర్వే ప్రతిపాదించింది.