వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వడంతో ఒక కోచ్ కిటికీలు పగిలిపోయిన ఘటన యూపీలోని బారాబంకిలో జరిగింది. గోరఖ్‌పుర్ నుంచి లఖ్‌నవూకు ఆదివారం ఉదయం 6 గంటలకు వందేభారత్ రైలు బయలుదేరగా రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో కోచ్ కిటకీలు పగిలాయి. RPF జవాన్లు ఘటనపై కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వగా, ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.