మణిపూర్ అల్లర్ల అంశం ఉభయ సభలను కుదిపేస్తోంది. ఈ అంశంపై చర్చించాలని విపక్ష ఎంపీల డిమాండ్ తో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో లోక్ సభ మధ్యాహ్నం 12 వరకు వాయిదా పడగా, రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. ఉభయ సభలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే వాయిదా పడ్డాయి. లోక్సభలో నెలకొన్న పరిణామాలపై స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తికి గురయ్యారు.