టూరిజం పేరు చెప్పి విశాఖపట్నంలోని రుషికొండపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపారని జనసేన నాయకులు సందీప్ విమర్శించారు. సీఎం జగన్ విశాఖ నుండి పరిపాలన అని ప్రకటించిన నేపథ్యంలో సీఎం క్యాంప్ కార్యాలయానికి రుషికొండపై ఏర్పాట్లు చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని తెలియజేసారు. సీఎం జగన్ రుషికొండను, విజయసాయిరెడ్డి ఆనందపురం తర్లువాడ కొండను కబ్జా చేస్తున్నారని, మాజీ మంత్రి అవంతీ ఎర్రమట్టి దిబ్బలను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి దురగతాలకు అడ్డు కట్టపడాలన్నారు. వారాహి యాత్రలో అక్రమాలను నిలదీసి ప్రజలను చైతన్య పరుస్తామని సందీప్ స్పష్టం చేశారు. జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నిటిని బయటికి తీస్తాం అని హెచ్చరించారు.