అనంతపురం జిల్లా, ముదిగుబ్బ మండలంలోని దొరిగిల్లు గ్రామంలో విషాదం నెలకొంది. పండుగకు బంధువుల ఇంటికి వచ్చిన ఓ యువకుడు నీట మునిగి ఊపిరాడక మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... .. కదిరిరూరల్ మండలం పట్నం గ్రామానికి చెందిన మహేష్ (25) పీర్లపండుగకు బంధువుల ఊరైన దొరిగిల్లుకు ఆదివారం వచ్చాడు. అయితే మధ్యాహ్నం పీర్లను ఎత్తుకోవడానికి ముందు నీట మునిగేందుకు సమీప వాగులోకి దిగాడు. ఆ సమయంలో మూర్చవ్యాధి రావడంతో మునిగిపోయి ఊపిరాడక మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసునమోదు చేసుకున్నారు.