మున్సిపల్ (ఆప్కాస్ ) కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని కోరుతూ ఆగస్టు 7న జరుగు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్ రామ్మూర్తి నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం రాజాం నుoడి బయలుదేరిన కార్మికులను ఉద్దేశించి రామ్మూర్తి నాయుడు మాట్లాడారు. కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చాలన్నారు.