పుంగనూరు-తంబళ్లపల్లే ఘటనల్లో టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తపరిచారు. ఏలూరులో పర్యటిస్తున్న చంద్రబాబును కలిసిన అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన పలువురు నేతలతో అయన మాట్లాడుతూ... పోలీసులు అర్థరహితంగా కేసులు పెడుతున్నారన్నారు. టీడీపీ కార్యకర్తలు మారణాయుధాలతో వచ్చారని, కేసులు పెట్టారంటూ వారు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.టీడీపీ నేతలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాధ్ రెడ్డి, ఘంటా నరహరి, శ్రీరాం చినబాబులపై హత్యయత్నం కేసులు నమోదు చేసారని తెలియజేసారు.