ప్రాణాపాయ స్థితిలో తనకు వచ్చిన ఆలోచనే ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడింది. వివరాల్లోకి వెళ్ళితే.... గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటున్న ఉలవ సురేశ్‌తో పుష్పాల సుహాసిని (35) అనే మహిళ సహజీవనం చేస్తోంది. వీరి కుమార్తెలు జెర్సీ (1), పదమూడేళ్ల లక్ష్మీకీర్తన. ఆదివారం తెల్లవారుజామున 4గంటల సమయంలో వారిని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి పాత వంతెన వద్దకు తీసుకెళ్లిన సురేశ్.. ఆ ముగ్గురినీ వంతెనపై నుంచి గోదాట్లోకి తోసేశాడు. సుహాసిని, జెర్సీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా లక్ష్మీకీర్తన అనే బాలిక బ్రిడ్జి గోడకు అడుగున ఉన్న పైపు పట్టుకుని ఆగింది. ప్రాణభయంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెకు 100కు డయల్ చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే తన సెల్‌ఫోన్ నుంచి 100కు డయల్ చేసి రక్షించాలని కోరింది. వెంటనే స్పందించిన ఎస్‌ఐ వెంకటరమణ నేషనల్‌హైవే సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పాపకు ధైర్యం చెబుతూ ఆమెను కాపాడారు.