పుంగనూరు సంఘటనపై టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న మాట్లాడుతూ.... చంద్రబాబుపై పగతో డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పర్యటనలో అడ్డుపెట్టిన లారీని తొలగిస్తున్న టీడీపీ కార్యకర్తలపై పోలీసులు అన్యాయంగా లాఠీచార్జి చేశారు. లారీని అడ్డుపెట్టిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదు? పోలీసు అధికారుల సంఘం వైసీపీ సంఘంగా వ్యవహరించడం దారుణం. పదవుల కోసం కొంతమంది పోలీసులు వైసీపీ నాయకుల కొమ్ముకాస్తున్నారు. పోలీసులు తమ విధుల నుంచి రెండు రోజులు తప్పుకుంటే జగనా? చంద్రబాబా? అన్నది తేలుతుంది’’ అని వెంకన్న చాలెంజ్ చేశారు.