ప్రజా ఉద్యమ గాయకుడూ గద్దర్ హఠాన్మరణం పట్ల రాజకీయ, సినీ, సాహిత్య రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. భౌతికంగా గద్దర్ లేకపోయినా ఆయన పాట ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉంటుందన్నారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేతలు లోకేశ్, కాసాని జ్ఞానేశ్వర్, అచ్చెన్నాయుడు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత జైరాం రమేశ్, రఘురామ కృష్ణంరాజు, విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల, సీపీఐ, సీపీఎం నేతలు కె.నారాయణ, బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు తదితరులు గద్దర్ కృషిని కొనియాడారు.