పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ ఏపీసీపీఎ్సఈఏ నేతలు సెప్టెంబరు 1న తలపెట్టిన ‘చలో విజయవాడ’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం విజయవాడలోని స్వాతంత్య్ర సమరయోధుల కాన్షరెన్స్ హాలులో జరిగింది. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు మాట్లాడుతూ ....... అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానన్న హామీని అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. దీనికి నిరసనగా సెప్టెంబరు 1న ‘వై నాట్ ఓపీసీ’ పేరుతో చలో విజయవాడ కార్యక్రమం, శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలు మద్దతుగా నిలవాలని కోరారు.