ఇటీవల రాష్ట్రంలో తీసుకొచ్చిన అసైన్డ్ భూములు (పీఓటీ, సవరణ) ఆర్డినెన్స్-2023 ప్రకారం 20 ఏళ్ల కాలపరిమితి అర్హత కలిగిన భూములను నిషేధ జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌లను రెవెన్యూశాఖ ఆదేశించింది. ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) జి. సాయిప్రసాద్ తాజాగా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అసైన్‌మెంట్ జరిగి 20 ఏళ్లు పూర్తయిన కేసుల్లో భూములను నిషేధ జాబితా నుంచి తొలగించేందుకు ఏ స్తాయిలో ఏం చేయాల్నో స్పష్టమైన మార్గర్శకాలు ఇచ్చారు. ఇది లంక భూములు, చెరువు భూములకు వర్తించదని స్పష్టం చేశారు.