సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు నేడు పోలవరం నియోజకవర్గంలో వేర్వేరుగా పర్యటించనున్నారు. గోదావరి వరద బాధితులను పరామర్శించేందుకు జగన్ కుక్కునూరు మండలం గొమ్ముగూడెం వస్తుండగా, ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’లో భాగంగా చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల, పోలవరం ప్రాజెక్టుల పరిశీలనకు చంద్రబాబు రానున్నారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రముఖ నేతలూ ఒకే రోజు ఒకే నియోజకవర్గంలో పర్యటిస్తుండడంతో భారీగా పోలీసులు మొహరించారు. వెయ్యి మందికి పైగా పోలీసులు పహారా కాస్తున్నారు. గ్రామానికి చుట్టుపక్కల దాదాపు ఐదు కిలోమీటర్ల ముందు నుంచే పోలీసులు తనిఖీలు చేపట్టారు.