అమృత్ భారత్ పథకంలో భాగంగా నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్‌కు కేంద్రం ద్వారా సుమారు రూ.28 కోట్లు విడుదల చేస్తున్నట్లు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు అన్నారు. ఆదివారం నిడదవోలులోని రైల్వేస్టేషన్లో వర్చువల్ పద్ధతిలో ప్రధాని నరేంద్రమోదీ న్యూఢిల్లీ నుంచి శంకుస్థాపన చేయగా ఎంపీ భరత్, ఎమ్మెల్యే జీఎస్ నాయుడు శిలా ఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మాట్లాడుతూ రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, ప్లాట్‌ఫారమ్స్ పునరుద్ధరించడం అమృత్‌భారత్ స్టేషన్ స్కీమ్ లక్ష్యమన్నారు.