నెల్లూరు జిల్లాకు చెందిన సర్పంచులు, పంచాయతీ నిధులు ప్రభుత్వం దారి మళ్ళిస్తుంది అంటూ న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. సర్పంచుల విధులను, నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుండటంపై ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సర్పంచులు చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి, కేంద్ర మంత్రులకు వరుసగా వినతి పత్రాలు అందజేస్తున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వం కాలరాసి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్పవ విగ్రహాలుగా మార్చిందని దుయ్యబట్టారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.8660 కోట్లను ప్రభుత్వం దొంగలించిందని, ఆ నిధులను తిరిగి ఇప్పించాలన్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి, హోంమంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు.