సాగునీటి రంగంలో ప్రోజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి చేపట్టామని, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇందులో భాగంగా నెల్లూరుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ఐదు నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రానికి నీటి కష్టాలు ఉండవని, నీటిని సద్వినియోగం చేసుకుంటే సిరులు పండించవచ్చునని చెప్పారు. సోమశిల, కండలేరు పనులకు బిల్లులు చెల్లించక పనులు ఆపేశారన్నారు. పనులు ఆగిపోవడంతో సోమశిల డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందన్నారు. మరల టీడీపీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యమౌతాయని తెలియజేసారు.