ఇబ్రహీంపట్నం; దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యోగ సంఘాలు తలపెట్టిన ఆగష్టు 9 న విజయవాడ లో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని ఇబ్రహీంపట్నం కామ్రేడ్ వెలగా లక్ష్మణ రావు భవన్ నందు విస్తృత స్థాయి సమావేశం లో సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎ వెంకటేశ్వరరావు సోమవారం అన్నారు. ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో మోడీని గద్దె దింపి దేశాన్ని కాపాడుకోవడానికి మహా ధర్నాలకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయన్నారు.