మణిపూర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ కాంగ్రెస్ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీపీపీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేలతో పాటు ఆ పార్టీ ఎంపీలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. సమావేశం సందర్భంగా.. రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వం పునరుద్ధరించడం, పార్టీ తదుపరి కార్యచరణ వంటి ముఖ్య అంశాలపై చర్చించినట్లు సమాచారం.