మహిళ మెడలో బంగారం గొలుసును ఇద్దరు ఆగంతకులు తెంచుకుని పరారైన ఘటనపై సోమవారం పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు నగరం చంద్రమౌళీ నగర్ 5వ లైనుకు చెందిన భాగ్యలక్ష్మి సోమవారం రింగ్ రోడ్డులోని శుభం కల్యాణ మండపానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళుతోంది. ఇద్దరు ఆగంతకులు అడ్డగించి, ఆమె మెడలోని 43 గ్రాముల బంగారం గొలుసు తెంచుకుని బైకుపై పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.