వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన వివాహిత పొలం వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన ఆవుల అంజిబాబు ఆమెను అనుసరించి పొలంలో అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో అటుగా ఆటోలో వెళ్తున్నవారు గమనించి ఆమె వద్దకు రావడంతో అంజిబాబు పరారయ్యాడు. సోమవారం వివాహిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వినుకొండ ఎస్సై లక్ష్మీప్రసాద్ తెలిపారు.