మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని నూతక్కి-చిర్రావూరు గ్రామాల మధ్యలో ఉన్న పంట పొలాలను ఎమ్మెల్యే ఆర్కే ఆర్ అండ్ బి, కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఆర్ అండ్ బి రహదారికి తూములు లేకపోవడంతో వర్షం నీరు ఎటూ వెళ్లలేకపోతుందని రైతులు ఎమ్మెల్యే కి తెలిపారు. దీంతో వెంటనే పొలాన్ని సర్వే చేసి వర్షపు నీరు పోయేందుకు కాలువలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.