గర్భిణులు, ఐదేళ్లలోపు చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు. ఇంటిన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా సోమవారం నరసరావుపేట మండలంలోని లింగంగుంట్ల అగ్రహారంలో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఇప్పటిదాకా వ్యాక్సిన్ వేయించుకోని వారిని గుర్తించాలని, వచ్చే నెల 2వరకు వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగించాలన్నారు.