గుంటూరు జిల్లాలో స్పెషల్ సమ్మర్ రివిజన్ 2024లో భాగంగా తప్పులు లేకుండా ఓటర్ల జాబితాని రూపొందించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి ఈఆర్వో, ఏఈఆర్ వోలను ఆదేశించారు. కలెక్టరేట్లోని విసీ సమావేశ మందిరంలో ఎన్ఎస్ఆర్ 2024పై సోమవారం సమీక్షించారు. నూతనంగా ఓట్లు, తొలగింపులు, మార్పులు, చేర్పులపై బీఎల్ వో లు దరఖాస్తులు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.