కోవిడ్ తర్వాత వైద్యరంగంలో వివిధ దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయని ముఖ్యంగా యువకులు గుండెపోటుకు అధికంగా గురౌతున్నారని జిల్లా కలెక్టర్ మల్లికార్జున అన్నారు. ఈమేరకు సోమవారం కేజీహెచ్ లో జరిగిన ఏపి స్టెమీ ప్రాజెక్ట్ శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్టెమీ ప్రాజెక్ట్ శిక్షణ కార్యక్రమం ద్వారా ప్రజలను గుండె పోటు నుండి రక్షించి మరణాలను తగ్గించవచ్చని వివరించారు.