తమ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల10న జరిగే సర్పంచుల ధర్నాను విజయవంతం చేయాలని బీజేపీ ఎలమంచిలి కన్వీనర్ రాజాన సన్యాసినాయుడు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేస్తోందన్నారు. పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంత పనులకు వినియోగించుకుంటుందని ఆరోపించారు.