విశాఖ బీచ్ రహదారిపై సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. యువకుల మద్యం మత్తు, అతి వేగం ముగ్గురి ప్రాణాలు తీసిన ఘటన కలకలం రేపింది. సాగర్ నగర్ నుంచి ఎండాడ వైపు వెళ్తున్న కారు రాడీసన్ హోటల్ మలుపు వద్దకు వచ్చేసరికి అదుపు తప్పింది. రహదారి మధ్యలోని డివైడర్ను ఢీకొట్టి తర్వాత ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో దంపతులు పృద్వీరాజ్(28), ప్రియాంక(21) సంఘటనా స్థలం లోనే ప్రాణాలు కోల్పోయారు.