ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ నియోజకవర్గంలో నిర్వహించారు. కర్నూలు మండలం నందనపల్లి గ్రామంలో మంగళవారం సుధాకర్ "గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్స్ తో కలిసి ప్రతి ఇంటింటికి వెళ్లి వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైయస్ జగన్ వారికి వివిధ పథకాల ద్వారా ఏ విధంగా లబ్ధి చేకూర్చింది, ఎంత లబ్ధి పొందింది ప్రజలకు వివరించారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని సంబంధించిన అధికారితో సమన్వయం చేసుకొని ఆ సమస్యకు పరిష్కారం మార్గాన్ని చూపుతూ ముందుకు సాగారు.