ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద ఇప్పటి వరకు 2,62,811 మంది వీధి వర్తకులకు రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైయస్ఆర్‌సీపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2022-23లో 49,534 మందికి, 2023-24లో ఆగస్టు 2 నాటికి 12,097 మంది వీధి వర్తకులకు రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. కోవిడ్ మహమ్మారి ప్రభావంతో దెబ్బతిన్న వ్యాపారాలను పునఃప్రాంరభించుకునేందుకు వీలుగా వీధి వర్తకులకు కొలేటరల్ ఫ్రీ వర్కంగ్ కేపిటల్ రుణాలను అందించే లక్ష్యంతో కేంద్రం 2020 జూన్ 1న ప్రధానమంత్రి వీధి వర్తకుల అత్మనిర్బార్ నిధి (పీఎం స్వానిధి) పథకం ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.