నరసన్నపేట మండలం చిన్న బొరిగి వలస పంచాయతీ మాజీ సర్పంచ్ పొన్నాన తవిటిరాజు మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పరామర్శించారు. మంగళవారం మృతిని స్వగృహానికి చేరుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్, ఎంపీపీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.