నేడు వైఎస్ వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా టీడీపీ యువనేత నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలకి చురకలు అంటించారు. ఈ రోజు బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గారి జయంతి, అబ్బాయిలు మరిచిపోయినట్టున్నారు. వీరికి బాబాయ్ జయంతి గుర్తుండదు కానీ వర్థంతి మాత్రం డేట్, టైముతో సహా గుర్తుంటుందని సీబీఐ నిర్ధారించింది. వేటు వేసిన చేతులతోనే బాబాయ్ జయంతికి ట్వీటు వేస్తే బాగోదనేమో వేయలేదు. అబ్బాయిల వేధింపులు-కుతంత్రాలకి ఎదురొడ్డి సోదరి సునీత గారు చేస్తున్న న్యాయ పోరాటంలో తప్పక గెలుస్తారు. తన తండ్రిని చంపిన కన్నింగ్ కజిన్స్‌తో జైలు ఊచలు లెక్కపెట్టించే వరకూ విశ్రమించరు. వివేకానందరెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను అని నారా లోకేష్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.