ఢిల్లీ సేవల బిల్లు రాజ్యసభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అయితే ఓటింగ్‌కు ముందు బిల్లుపై వాడీవేడి చర్చ జరుగనుంది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్‌చైర్‌పై రాజ్యసభకు హాజరయ్యారు. 90 ఏళ్ల వయసులోనూ ఆయన చర్చలో పాల్గొన్నారు. ఈ వయసులో కూడా అనారోగ్యాన్ని లెక్కచేయకుండా తన బాధ్యతలు నిర్వహించేందుకు వచ్చిన మాజీ ప్రధానిని చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.