మాచర్ల సన్నాసివైన నువ్వెంత... నీ బతుకెంత ఎమ్మెల్యేల పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఇదిలావుంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో, యువగళం పాదయాత్ర ప్రదేశం (గురజాల)లో టీడీపీ నేతలు యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, జీ.వీ.ఆంజనేయులు, పత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశం నిర్వహించారు. మాచర్ల ఎమ్మెల్యేల పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నిప్పులు చెరిగారు. తీవ్ర పదజాలంలో విరుచుకుపడ్డారు. లోకేశ్ యువగళం పాదయాత్రకు వస్తున్న ప్రజా వెల్లువ చూసి మాచర్ల ఎమ్మెల్యే అనే పిచ్చి కుక్క మొరుగుతోంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిపై ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకున్నాడు. లోకేశ్ స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో చదివి వరల్డ్ బ్యాంక్ లో ఉద్యోగం చేశారు. చంద్రబాబు, లోకేశ్ లతో పోల్చితే మాచర్ల సన్నాసివైన నువ్వెంత... నీ బతుకెంత? అసలు నీ చరిత్ర ఏంటో చెప్పు సన్నాసీ? పెద్దిరెడ్డే పెద్దాయనా... చంద్రబాబు పెద్దాయన కాదా? నువ్వొక విగ్రహాల దొంగవి అంటే ఎప్పుడైనా కాదని చెప్పావా? ప్రజల సొమ్ము తిని ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడకు. మాచర్లలో నీ బతుకేంటో అందరికీ తెలుసు పిన్నెల్లీ. పాడుబడిన అద్దెకొంపలో టార్పాలిన్ పట్ట కప్పుకొని బతికిన నువ్వు, నేడు ప్రజల సొమ్మ తిని బరితెగించి మాట్లాడుతున్నావు అని వారు ధ్వజమెత్తారు.