హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా జిల్లాలోని థియోగ్-చైలా హైవేపై మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపు తప్పి రోడ్డుపై ఉన్న 5 కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మితిమీరిన వేగంతో డ్రైవర్ అదుపు తప్పి ట్రక్కు ప్రమాదానికి కారణమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రక్ డ్రైవర్ను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.