లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ ప్రసంగిస్తుండగా బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. స్పీకర్ అడ్డుకుంటున్నా వినకుండా రాహుల్ ప్రసంగానికి అంతరాయం కలిగిస్తున్నారు. దీంతో ప్రతిపక్ష కూటమి ఎంపీలు సైతం పోటాపోటీగా నినాదాలు చేస్తుండటంతో సభ గందరగోళంగా మారింది.