అవిశ్వాస తీర్మానంపై రాహుల్ ప్రసంగం తర్వాత కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాహుల్ ఆరోపిస్తున్నట్లుగా మణిపూర్ ముక్కలు కాలేదని, అది ఒకటిగానే ఉందని వివరించారు. కశ్మీర్ వెళ్లి ప్రజాభిప్రాయ సేకరణకు డిమాండ్ చేసిన రాహుల్ నేడు దేశాన్ని ముక్కలు చేయటం గురించి మాట్లాడటంలో ఆశ్చర్యం లేదన్నారు. కశ్మీర్లో అత్యంత దారుణంగా హత్యకు గురైన మహిళల సంగతి రాహుల్ మరిచారన్నారు.