బీజేపీ నాయకులు, ప్రధాని మోడీ టార్గెట్గా రాహుల్ గాంధీ లోక్సభలో బుధవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'భారతమాతను చంపేశారు. మీరు దేశభక్తులు కాదు.. దేశద్రోహులు' అని వ్యాఖ్యానించారు. రామాయణంలో రావణుడు ఇద్దరి మాటలే వినేవాడని, ప్రధాని మోడీ అదానీ, అమిత్ షా అనే ఇద్దరి మాటలే వింటారని అన్నారు. దేశ ప్రజల గుండె చప్పుడు వినే సమయం ప్రధాని మోడీకి లేదన్నారు. ప్రధాని దృష్టిలో దేశంలో మణిపూర్ అనేది లేదన్నారు.