చంద్రబాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం అన్యాయమని కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు, టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారని తెలిపారు. అంగళ్లులో జరిగిన ఘర్షణ ఘటనలో లేని పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డిని కేసులో ఎలా చేర్చారని ప్రశ్నించారు. టీడీపీ నేతల కోసమే పోలీసులు 307 సెక్షన్ వినియోగిస్తున్నారని మండిపడ్డారు.