మాదాపూర్‌లోని కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జిపై అతివేగంతో వెళ్తున్న కారు బోల్తా పడింది. వేగంగా వస్తున్న క్రమంలో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారులో ఉన్న వ్యక్తి పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa