పామూరు మండలంలోని పడమటి కట్టకిందపల్లి గ్రామంలో వాల్ ఇంటర్ గా పనిచేస్తున్న రాచమల్ల గురుప్రసాదును కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగిస్తున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఈనెల 2వ తేదీన నకిలీ వేలిముద్రలతో పింఛన్లను అతని సోదరుడు పంపిణీ చేస్తున్నట్లు లబ్ధిదారులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టారు. అభియోగాలు రుజువుకావడంతో వాలెంటరు బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు ఆయన ఆదేశాలు జారీ చేశారు.